సామాజిక విప్లవ పితామహులు.. పూలే విగ్రహాల ఏర్పాటుకు సహకరిస్తా
మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్
జవహర్ నగర్,(విజయక్రాంతి): సామాజిక విప్లవ పితామహులు బీసీల ఆరాధ్య దైవం మహాత్మ జ్యోతిరావు పూలే తొలి మహిళా టీచర్ సావిత్రిబాయి పూలే విగ్రహాలను జవహర్ నగర్ లో ఏర్పాటు చేయటానికి సహకరిస్తానని మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ పేర్కొన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ పరిధిలోని జవహర్ నగర్ బీసీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే జంట విగ్రహాల ఏర్పాటుకు సంబంధించి బుధవారం మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ ను బీసీల ఐక్యవేదిక అధ్యక్షుడు సోమాచారి ఆధ్వర్యంలో బీసీ ఐక్యవేదిక కార్యవర్గం కలిసి సమస్యలను వివరించారు. దీనికి వెంటనే స్పందించిన మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ మాట్లాడుతూ సామాజిక విప్లవ పితామహుడు బిసిల ఆరాధ్య దైవం మహాత్మ జ్యోతిరావు పూలే తొలి మహిళా టీచర్ సావిత్రిబాయి పూలేల విగ్రహాలను జవహర్ నగర్ లో ఏర్పాటు చేయటానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు.






