స్మృతి, జెమీమాలతో హ్యూందాయ్ క్యాంపెయిన్
న్యూఢిల్లీ, జూన్ 13 : మహిళల క్రికెట్‌కు కొన్నేళ్లుగా క్రేజ్ పెరుగుతోంది. ఒకప్పుడు పెద్దగా ఆసక్తి చూపని కార్పొరేట్ దిగ్గజ కంపెనీలు సైతం ఇప్పుడు మహిళా క్రికెటర్లతో ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. తమ కంపెనీలకు వుమెన్ క్రికెటర్లను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకుంటున్నాయి. దీనిలో భాగంగా హ్యూందాయ్ మోటార్ ఇం డియా తమ బ్రాండ్ అంబాసిడర్లు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌తో కొత్త బ్రాండ్ ప్రచారాన్ని ఆవిష్కరించింది.
మహిళల టీ20 ప్ర పంచకప్‌లో భారత జట్టుకు మద్ధతుగా దీవానే ఇండియాకా దీవానా హమ్‌సఫర్ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. దేశంలో మహిళల క్రికెట్‌కు పెరిగిన మద్ధతు, అభిమానులకు స్ఫూర్తినిచ్చేలా ఈ క్యాంపెయి న్‌కు శ్రీకారం చుట్టింది. ఈ మెగాటోర్నీలో భారత మహిళల జట్టు విజేతగా నిలవాలని హ్యందాయ్ మోటార్ ఇండియా ప్రతినిధి విరాట్ ఖుల్లార్ ఆకాంక్షించారు.






