ముమ్మరంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్
18-08-2026 01:59 PM
ఆసిఫాబాద్(విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 14 సంవత్సరాలు నిండిన, 15 ఏళ్లలోపు బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వైద్య సిబ్బంది విద్యార్థినులకు హెచ్‌పీవీ టీకాలు వేశారు.భవిష్యత్తులో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో పాటు సంబంధిత వ్యాధుల బారిన పడకుండా ముందస్తు రక్షణ కల్పించేందుకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేస్తున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. అర్హత కలిగిన ప్రతి బాలిక తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ సూచించింది.






