అక్రమ నిర్మాణానికి అనుమతి ఏంటి
మున్సిపల్ అధికారుల తీరుపై ఆరోపణలు
జడ్చర్ల మున్సిపాలిటీ లో ఇష్టమొచ్చినట్లు పర్మిషన్లు జారీ
జడ్చర్ల: జడ్చర్ల పురపాలక సంఘం అధికారులు పబ్లిక్ రోడ్డును కబ్జా చేసేలా బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చారంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జడ్చర్లకు చెందిన బీకు ఆంజనేయులు మున్సిపల్ కమిషనర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో సర్వే నంబర్ 281లోని ప్లాట్ నంబర్ 68/A సదరు ప్లాటు యజమాని, ఎలాంటి తన ప్లాట్ ముందున్న 25 ఫీట్ల రోడ్డుపై బిల్డింగ్ కట్టుకోవడానికి అనుమతి ఇచ్చారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ... తాను సర్వే నంబర్ 282 లోని 38A ప్లాట్‌ను 5939/2011, 576/2015 దస్తావేజుల ద్వారా కొనుగోలు చేశానని తెలిపారు.
తన ప్లాట్ ముందు 25 ఫీట్ల పబ్లిక్ రోడ్డు ఉందని, ఆ రోడ్డుపై లేఅవుట్ వారికి ఎలాంటి హక్కు లేదన్నారు.అయితే పక్క సర్వే నంబర్‌లోని 68/A ప్లాట్ ఓనర్‌కు తన ప్లాట్ ముందున్న రోడ్డుపై నిర్మాణానికి ప్రొవిజనల్ పర్మిషన్ ఆర్డర్ నంబర్ 011979/BADE/00082/IABP/2025, తేదీ 08.08.2025 ద్వారా అనుమతి ఇచ్చారని ఆరోపించారు.కాసులకు ఆశపడి మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి ఇతర అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.కనీసం సదరు వ్యక్తి ఇంటి నిర్మాణలు చేపడుతున్న అధికారులు పనులను నిలిపివేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇట్టి జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు ప్రజావాణి కి ఫిర్యాదు చేశానని అయిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి అని పేర్కొన్నారు. జడ్చర్ల పట్టణంలో కూడా బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.చట్టవిరుద్ధంగా ఇచ్చిన ఈ పర్మిషన్‌ను వెంటనే రద్దు చేసి, రోడ్డు కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను కోరారు.ఈ ఆరోపణలపై మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి లక్ష్మిపతి మాట్లాడుతూ రోడ్డు కబ్జా కు గురైన అంశంలో ఆంజనేయులు ఫిర్యాదు మేరకు సోమవారం వరకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.సదరు ఇంటి నిర్మాణం పనులు చేపట్టిన వ్యక్తికి నోటిసులు జారీ చేశామని తెలిపారు.






