గృహిణి అదృశ్యం
జవహర్‌నగర్ పీఎస్‌లో భర్త ఫిర్యాదు
జవహర్‌నగర్, మే 19 (విజయక్రాంతి): జవహర్‌నగర్ లోని బాలాజీనగర్‌కు చెందిన గృహిణి అదృశ్యమైన సంఘటన జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌హెచ్‌వో సైదులు తెలిపిన కథనం ప్రకారం బాలాజీనగర్‌కు చెందిన గుగులోతు ఉపేందర్ నాయక్ భార్య మౌనిక దంపతులు బాలాజీనగర్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఉపేందర్ నాయక్ ఆర్మీ డెంటల్ కాలేజీ సమీపంలో రేడియం షాపు నిర్వహిస్తున్నాడు.
ఈ నెల 18వ తేదీన మధ్యాహ్నం భోజనం కోసం ఉపేందర్ ఇంటికి వెళ్లగా భార్య మౌనిక (22) ఇంట్లో కనిపించకుండా పోయినట్లు గమనించాడు. ఈ మేరకు ఆమె కోసం చుట్టుపక్కల వెతికినా బంధువుల వద్ద వెతికినా తెలిసిన వారి వద్ద వెతికినా సమాచారం లభించలేదు. మౌనిక ఫోన్‌కు కాల్ చేయగా స్విచ్ ఆఫ్ వస్తుంది. సీసీటీవీ పరిశీలించగా ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఆటోలో వెళ్లినట్టు గుర్తించారు. ఈ మేరకు ఉపేందర్ జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






