ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు నిలిపివేయండి
అధికారులకు హైకోర్టు షోకాస్ నోటీసు.
తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో ఉన్న ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 111 లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని సంబంధిత అధికారులకు రాష్ట్ర హైకోర్టు షోకాస్ నోటీసులు జారీ చేసింది. విజయ విద్యాలయ హై స్కూల్ మాజీ విద్యా కమిటీ చైర్మన్ లంక పాండు , షబ్బీర్ అహ్మద్ అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని హైకోర్టులో వ్రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
తెలంగాణ రాష్ట్రం, దాని ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ డిపార్ట్‌మెంట్, సెక్రటేరియట్, హైదరాబాద్, జిల్లా కలెక్టర్, వికారాబాద్ జిల్లా, రెవెన్యూ డివిజనల్ అధికారి, తాండూర్, తహసీల్దార్, తాండూర్ మండలం , కమిషనర్, మున్సిపల్ , తాండూర్, .పసరం బస్వ రాజ్,పసరం లలిత్ సందీప్ నిషాంక్,జె. భాను ప్రకాష్, విజయ విద్యాలయ హై స్కూల్, హెడ్ మాస్టర్, ప్రతివాదులుగా ఉన్నారు. సర్వే నం. 111లో అక్రమ నిర్మాణాలను ఆపాలని మరియు 14.14 గుంటల భూమిని కొలిచి అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని . .. నాలుగు వారాల్లో ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 111 కు సంబంధించిన పత్రాలను సమర్పించాలని హైకోర్టు జారీ చేసిన షోకాస్ నోటీసు లో పేర్కొంది.




