28 March, 2026 | 6:26 PM

Breaking News

గర్భిణీ స్త్రీలు బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి   •   ఆశా కార్యకర్తల అరెస్టు తగదు   •   తిరుమలగిరి జడ్‌పిహెచ్‌ఎస్‌లో ఎస్సెస్సీ పరీక్ష కేంద్రం తనిఖీ చేసిన ఎంఆర్వో   •   జాతీయస్థాయిలో జిల్లా కలెక్టర్ నిర్మల్ దక్కిన గౌరవం   •   ఎస్సెస్సీ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్   •   వికలాంగులకు 6 వేల పెన్షన్ హామీ ఏమైంది....?   •   మైనర్లతో కౌన్సిలర్ కొడుకు అసభ్యకర వీడియోలు..100 మందికి పైనే బాధితులు   •   దేవాదాయ శాఖను అభినందించిన మంత్రి తుమ్మల   •   మామునూరు టూరిజం అభివృద్ధి పనులను పరిశీలించిన బండారు నరసింహారావు   •   ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కవిత   •  

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ క్యాంప్

26-03-2026 01:08 AM

హాజరైన ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు 

ధర్మపురి,మార్చి25(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప ట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమా ర్ ఆదేశాల మేరకు వెల్గటూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఉచిత హెల్త్ క్యాంప్ను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ బండమీది కవితతో పాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటిపర్తి శైలందర్ రెడ్డి, ఉపసర్పంచ్ గండ్ర ప్రతాప్ రావు లు ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ఈ 99 రోజుల ప్రణాళికలో భాగంగా వైద్య శిబిరాలను ఏ ర్పాటు చేయడం జరుగుతోందని, గ్రామీణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిబిరానికి వచ్చిన రో గులకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డా క్టర్ తేజశ్విని, వార్డ్ సభ్యులు గుండాటి సందీప్ రెడ్డి, నక్క సురేష్, కాంగ్రెస్ నాయకులు బందెల ఉదయ్ గౌడ్,గుమ్ముల అజ య్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.