24 April, 2026 | 12:09 PM

Breaking News

అడవికి వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్రగాయాలు   •   కోనరావుపేటలో ఘనంగా పీఎం శ్రీ ఎంపీపీ ఎస్ ప్రైమరీ స్కూల్ 2వ వార్షికోత్సవం – గ్రాడ్యుయేషన్ డే వేడుకలు   •   కమిటీల పేరుతో కాలయాపన: 900 రోజులైనా— హామీల అమలు ఏమైంది?   •   సివిల్ ఇంజినీర్స్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం   •   రోడ్లపైకి ఆర్టీసీ కార్మికులు..!   •   అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం   •   చర్చలు ప్రారంభం.. హామీలు అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్   •   ఆవేశంలో అఘాయిత్యాలకు పాల్పడవద్దు.. ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి   •   సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు: RTC డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మహేష్ గౌడ్ దిగ్భ్రాంతి   •   ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల సీఎం రేవంత్ దిగ్భ్రాంతి   •  

పురుగు మందు తాగి చికిత్స పొందుతూ మృతి

19-12-2025 12:00 AM

పాపన్నపేట, డిసెంబర్ 18 : పురుగు మందు సేవించి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్త్స్ర శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బైకని శ్రీనివాస్(38) ప్రైవేటు డ్రైవర్ గా పని చేసేవాడు. కొన్ని నెలల క్రితం జరిగిన ఓ ప్రమాదంలో కాలు విరిగి ఇంటి వద్దే ఉంటున్నాడు. కాలు విరిగిందని ఏ పని చేయలేక పోతున్నానని తరచూ ఇంట్లో బాధ పడుతుండేవాడు.

మనస్తాపం చెందిన అతను జీవితంపై విరక్తి చెంది బుధవారం ఇంట్లో నుంచి పొలం వద్దకు వెళ్లాడు. పురుగు మందు సేవించి అవస్థ పడుతుండగా స్థానికులు గమనించి చికిత్స కోసం మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి సమయంలో మృతి చెందాడు. మృతుడి భార్య ఎలీషా ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్త్స్ర పేర్కొన్నారు.