22 April, 2026 | 2:17 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

మంత్రి ఉత్తమ్‎కు హరీశ్ రావు లేఖ— ప్రాజెక్టులతో చెలగాటం ఆడొద్దని హెచ్చరిక

08-04-2026 02:08 PM

హైదరాబాద్: తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డికి( Minister Uttam Kumar Reddy) మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ(Harish Rao Open Letter ) రాశారు. కాళేశ్వరం, దేవాదుల మోటార్లపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తరచూ ఆన్-ఆఫ్ చేస్తే మోటార్లు, పంపులు దెబ్బతింటాయని సూచించారు. ఇది ప్రభుత్వ పాలనాపరమైన నిర్లక్ష్యమా?, లేకా కావాలనే చేస్తున్న కుట్రనా? అని ప్రశ్నించారు. భారీ మోటార్లు నిరంతరం నడిచేలా డిజైన్ చేసినవి.. పదేపదే ఆపితే తీవ్ర నష్టం వాటిల్లుతోందని హరీశ్ రావు తెలిపారు. వేల కోట్లతో నిర్మించిన ప్రాజెక్టులను ఇలా వాడటం సరికాదని చెప్పారు. డిజైన్ కు అనుగుణంగా నిరంతరాయంగా పంపులు నడిపించాలని కోరారు. మీ రాజకీయాల కోసం ప్రాజెక్టులతో చెలగాటం ఆడొద్దని ఆయన హెచ్చరించారు.