ఇప్పటికీ మహిళలపై వేధింపులు ఆగడం లేదు
మున్సిపల్ చైర్ పర్సన్ అనూష
ఆదిలాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగా ల్లో ముందంజలో ఉన్నప్పటికీ కొన్ని పని ప్రదేశాల్లో నేటికి మహిళలు వివక్ష, వేదింపులకు గురువుతున్నారని మున్సిపల్ చైర్పర్సన్ బం డారి అనూష అన్నారు. యాక్షన్ ఎయిడ్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం రిమ్స్ ఆడిటోరియంలో మహిళలపై వివక్ష, వేదింపులపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా స్వచ్చందం సంస్థ ప్రోగ్రాం అధికారిణి వందన పాల్ మహిళలపై జరుగుతున్న వేదింపు, వివక్షపై అవగాహన కల్పిం చారు. వాటి నిరోధానికి రూపొందించ పోష్, తదితర చట్టాలను వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లోరాణిస్తున్నప్పటికీ పని ప్రదేశాల్లో వారు వేదింపులు, వివక్షను ఎదుర్కొవడం విచారకరమన్నారు.
మహిళలు, యువతులు ధైర్యంగా, నిజాయితీగా ఉంటే ఎక్కడా తలదించుకునే అవసరం ఉండదన్నారు. కొన్ని ప్రాంతాల్లో తమకు జరుగుతున్న అన్యాయాలపై ఎదిరించేందుకు కొందరు వెనుకావడటం వల్ల నేటికి మహిళలపై వేదింపులు కొనసాగుతున్నాయన్నారు.
ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళలు అవగాహన లేనంత వరకు న్యాయం జరగదన్నారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకొని రక్షణ పొందాలని సూచించారు. ఈ సదస్సులో రిమ్స్ డైరక్టర్ జైసింగ్ రాథోడ్, వైద్యులు బండారి నరేందర్, దీపక్ పుష్కర్, తానాజి జాడే, మెడికోలు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




