14 August, 2026 | 10:20 AM

జాతీయ స్ఫూర్తిని చాటేలా హర్ ఘర్ తిరంగా

14-08-2026 12:19 AM

మాజీ ఎమ్మెల్యే రామచంద్రా రెడ్డి

ఖైరతాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి): పీఎం మోదీ పిలుపు మేరకు జాతీయ స్ఫూర్తిని చాటేలా బిజెపి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి అన్నారు. హిమాయత్ నగర్ డివిజనులోని గాంధీకుటీర్ బస్తీలో గడపగడపకూ వెళ్తూ నివాసితులకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. వాటిని ఇంటిపై ఎగురవేసేలా ప్రోత్సహించి దేశభక్తిని చాటారు.