ఘనంగా చౌడలమ్మదేవి విగ్రహ ప్రతిష్టాపన
24-04-2026 01:05 AM
బిబిపేట్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం మాందాపూర్ గ్రామంలో గురువారం శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో చౌడాలమ్మ దేవి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్ఠ చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ హరీష్ యాదవ్, యాదవ సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు , ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






