8 June, 2026 | 6:19 PM

Breaking News

నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •   పగలైనా.. రాత్రైనా.. విద్యుత్ సమస్యలపై యోధుడిలా పోరాడే ‘కరెంట్ దేవుడు’ నరసింహ   •   రసాభాసగా మారిన వార్డు సభ సమావేశాలు   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు విస్తృతంగా చేపట్టండి   •  

నిర్దేశిత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో అభివృద్ధి

08-06-2026 05:01 PM

* పనులను పూర్తి చేయాలి.. జిల్లా కలెక్టర్ రాజర్షిషా..

ఉట్నూర్,(విజయక్రాంతి): గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, సమగ్ర రూపాంతరం కేవలం ప్రజా భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షిషా స్పష్టం చేశారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం నార్నూర్ మండలం కొత్తపల్లి (హెచ్) గ్రామంలోని నిర్వహించిన గ్రామసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామసభలో గ్రామస్తుల నుంచి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్న కలెక్టర్.. వాటి పరిష్కారానికి తక్షణమే నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, అంతర్గత రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, నిధులను సద్వినియోగం చేసుకుంటూ నాణ్యతతో పనులు పూర్తి చేయాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలోని వ్యవసాయం వర్షపాతంపైనే ఆధారపడి ఉన్నందున, రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంచుకోవాలని  సూచించారు. ఆగస్టు 15 నాటికి ఆశించిన వర్షాలు పడకపోతే పెసర్లు, కందులు, మినుములు, సోయాబీన్ వంటి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలన్నారు.

ముందస్తు విత్తనాలు వేసి నష్టపోవద్దని, పదును పడ్డాకే విత్తాలని వ్యవసాయ అధికారుల సలహాలను గుర్తు చేశారు. అలాగే తక్కువ ధరకే అమ్మే నకిలీ విత్తనాలను నమ్మి మోసపోవద్దని, కేవలం ప్రభుత్వ గుర్తింపు పొందిన లైసెన్స్‌డ్ డీలర్ల వద్దే కొనుగోలు చేసి రసీదులు భద్రపరుచుకోవాలని హెచ్చరించారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై సమాచారం ఇస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ టాయిలెట్లను, పుల్లబాయి-దేవిదాస్ లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్ల గృహ గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా హాజరై కలెక్టర్ ప్రారంభించారు.