calender_icon.png 10 February, 2026 | 8:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తంగళ్ళపల్లిలో గ్రామసభ నిర్వహణ.. సమస్యల పరిష్కారానికి కృషి

10-02-2026 06:28:11 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి గ్రామంలో మంగళవారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభలో గ్రామంలోని పలు సమస్యలపై విస్తృతంగా చర్చించినట్లు సర్పంచ్ మోర లక్ష్మీరాజం తెలిపారు. ప్రజలు గ్రామసభకు హాజరై తమ సమస్యలను తెలియజేస్తే వాటి పరిష్కారానికి గ్రామపంచాయతీ తరఫున పూర్తి స్థాయిలో కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, గ్రామ సెక్రటరీ సమీర్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.