calender_icon.png 6 February, 2026 | 9:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దర్జాగా ప్రభుత్వ భూమి కబ్జా

06-02-2026 12:11:57 AM

  1. ప్రభుత్వ స్థలాలను కబ్జాకు పాల్పడితే.. కటకటాలపాలే 
  2. కాప్రా తహసీల్దార్ బైరెడ్డి రాజేశ్

జవహర్ నగర్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): సర్కారు స్థలాలు కబ్జాచేయాలని చూస్తే కటకటాలపాలే అవుతారని, అమాయకపేదలకు ప్రభుత్వ భూములు ప్లాట్లుగా చేసి అమ్ముతూ సొమ్ముచేసుకుంటున్న కబ్జాదారులపై ప్రత్యేక దృష్టి పెట్టామని కాప్రా తహసీల్దార్ బైరెడ్డి రాజేశ్ హెచ్చరించారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధి జవహర్ నగర్ లోని సర్వే నెం. 696లో సుమారు 20గుంటల భూమి అన్యాక్రాంతం అవుతుందని తెలుసుకుని... కాప్రా తహసీల్దార్ రాజేశ్ ఆధ్వర్యంలో గురువారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ సమక్షంలో ఫెన్సింగ్ వేసి కాపాడారు. ఈ సందర్భంగా రాజేశ్ మాట్లాడుతూ ప్రభుత్వ భూముల రక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని, కోట్ల రూపాయాల విలువైన భూమిని కాపాడి కంచె ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.