14 June, 2026 | 2:30 AM

అమ్మాయిలూ అదరగొట్టండి

14-06-2026 12:52 AM

ప్రపంచ క్రికెట్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్‌లకు ఉండే క్రేజే వేరు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా, పురుషుల క్రికెట్ అయినా మహిళల క్రికెట్ అయినా ఈ పోరు కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. రెండు దేశాల మధ్య మ్యాచ్ జరిగి చాలా రోజులే అయింది. ఇప్పుడు ఇంగ్లీష్ గడ్డపై చిరకాల ప్రత్యర్థులు తలపడబోతున్నాయి. మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాక్‌తో తొలిమ్యాచ్ ఆడబోతున్న భారత్ టైటిల్ వేటను ఘనంగా ప్రారంభించాలని భావిస్తోంది.

  1. ఫేవరెట్‌గా భారత మహిళల జట్టు
  2. పాక్ మహిళలతో భారత్ పోరు
  3. టీ ట్వంటీ ప్రపంచకప్

బర్మింగ్‌హామ్, జూన్ 13 : మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. ఆదివారం బర్మింగ్ హామ్‌లోని ఎడ్జ్ బాస్టన్ వేదికగా చిరకాల ప్రత్యర్థుల సమరం జరగనుంది. రాజకీయ కారణాలతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. భారత్, పాక్ కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడతున్నాయి. ఈ నేపథ్యంలో దాయాదుల క్రికెట్ సమరం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత ఏడాది వన్డే ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు ఇప్పటి వరకూ టీ20 ప్రపంచకప్ గెలవలేదు. ఈసారి పొట్టి ప్రపంచకప్ ను ముద్దాడాలని పట్టుదలగా ఉన్న భారత్ తన టైటిల్ వేటను పాక్‌పై భారీ విజయంతో మొదలుపెట్టాలని ఎదురుచూస్తోం ది.

పాకిస్తాన్‌తో పోలిస్తే భారత జట్టు అన్ని విభాగాల్లోనూ మెరుగ్గానే కనిపిస్తోంది. ముఖ్యంగా భారత బ్యాటింగ్ అత్యం త బలం గా ఉంది. స్మృతి మంధాన, షఫాలీ వర్మ ఓపెనర్లుగా ఇచ్చే ఆరంభాలే జట్టుకు కీలకం. వీరిద్దరూ చెలరేగితే భారీస్కోరుకు పునాది పడడం ఖాయం. అ లాగే జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్, రిఛా ఘోష్, దీప్తి శర్మలతో మిడిలార్డర్ సమతూకంగా ఉంది. భార తి పుల్మాలి లాంటి ఫినిషర్ జట్టులో ఉండ డం మనకు అడ్వాంటేజ్. బ్యాటింగ్ లైనప్ లో ఏ ముగ్గురు రాణించినా పాక్ కు చుక్కలు గ్యారెంటీ. మరోవైపు బౌలింగ్‌లో మాత్రం భారత్ కాస్త వీక్‌గా కనిపిస్తోంది. ఈ టోర్నీకి సన్నాహకంగా ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్‌లో మన బౌలర్లు పూర్తిగా తేలిపోయా రు.

వార్మప్ మ్యాచ్ లలోనూ పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో బౌలింగ్ పూర్తిస్థాయిలో గా డిన పడాల్సి అవసరం కనిపిస్తోంది. ప్రధాన టోర్నీలో బౌలర్లు పుంజుకుంటారని కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కాన్ఫిడెంట్ గా ఉంది. తొలిసారి వరల్ కప్ ఆడుతున్న శ్రీ చరణి, క్రాంతి గౌడ్, భారతి ఫుల్మాలి, నందిని శర్మ ఎలా రాణిస్తారో చూడాలి. రేణుకా సింగ్ ఠాకూర్ తో పాటు అరుంధతి రెడ్డి పేస్ విభాగంలో కీలకమని చెప్పొచ్చు. స్పిన్ విభా గంలో  శ్రే యాంక పాటిల్, రాధా యాదవ్, శ్రీ చరణిలపై భారీ అంచనాలున్నాయి.

ఇదిలా ఉంటే పాక్ మహిళల జట్టు పేలవ ఫామ్‌తో సతమతమవుతోంది. ఇటీవల ఐర్లాండ్‌లో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. పాక్ జట్టు లో ఓపెనర్లు మునీబా ఆలీ, గుల్ ఫెరోజా, కెప్టెన్ ఫాతిమా సనా తప్పిస్తే మిగిలిన వారెవరూ ఫామ్‌లో లేరు.  గత రికార్డులు చూస్తే భారత్, పాకిస్తా న్ జట్లు ఇప్పటివరకు 16 సార్లు తలపడితే..భారత్ 13 సార్లు గెలిచింది. పాక్ కేవలం మూడింటిలోనే విజయం సాధించింది.

పిచ్ రిపోర్ట్ 

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. మ్యాచ్ సాగే కొద్దీ స్లో బౌలర్లు కీలకం కానున్నారు.  

తుది జట్ల అంచనా

భారత్ : స్మతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్‌కౌర్(కెప్టెన్), రిఛా ఘోష్, దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, క్రాంతి గౌడ్, నందిని శర్మ, రాధా యాదవ్

పాకిస్థాన్ : మునీబా అలీ, గుల్ ఫిరోజా, అయేశా, అలియా, ఫాతిమా సనా(కెప్టెన్), సైరా జబీన్, నటాలియా, తుబా హసన్, సాదియా, డయానా బేగ్, నష్రా సంధు