కేశంపేట్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్
షాద్ నగర్ జూన్ 18 (విజయక్రాంతి): ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి, గురువారం కేశంపేట్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్‌లోని వివిధ విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ పరిశుభ్రత, శాంతిభద్రతల నిర్వహణ, నేరాల నియంత్రణ చర్యలు, ప్రజలకు అందిస్తున్న సేవలు మరియు సిబ్బంది పనితీరును సమీక్షించారు.
ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి పోలిసులు ప్రజల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ఫిర్యాదులపై తక్షణ స్పందన ఇవ్వాలని, పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని, శాంతిభద్రతల పరిరక్షణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, మహిళలు మరియు పిల్లల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రామస్థాయిలో కమ్యూనిటీ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిసరాల్లో పరిశుభ్రతను పాటిస్తూ, ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన మరియు నాణ్యమైన పోలీసు సేవలు అందించాలని కమిషనర్ గారు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో షాద్‌నగర్ డీసీపీ శిరీష , ఏసీపీ లక్ష్మీనారాయణ , కేశంపేట్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ నరహరి ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.






