మంత్రి ఉత్తమ్ సహకారంతో మరింత అభివృద్ధి: సర్పంచ్
26-03-2026 04:32 PM
మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలంలోని పాత దొనబండతండా గ్రామానికి ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.10లక్షల నిధులతో చేపట్టిన సీసీరోడ్డు నిర్మాణ పనులను గురువారం సర్పంచ్ ఘమామంద నాయక్ పాలకవర్గ సభ్యులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ మార్రెడ్డి సహకారంతో గ్రామాని మరింత అభివృద్ధి చెస్తానని,గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భూక్యా దూబ్ల నాయక్, మాజీ సర్పంచ్ హనుమా,వార్డు సభ్యులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.




