గ్రామ పంచాయతీ తీర్మానం మేరకే నిధులు ఖర్చు
స్వర్ణలత విజయ్ సర్పంచ్ రంగంపేట.
కొల్చారం( విజయ క్రాంతి): గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యుల తీర్మానం మేరకే గ్రామపంచాయతీ నిధులతో గ్రామంలో అభివృద్ధి శానిటేషన్ కార్యక్రమాలు చేపడుతున్నట్లు రంగంపేట సర్పంచ్ ఆరిగే స్వర్ణలత విజయ్ అన్నారు. గురువారం రంగంపేటలో జరిగిన ప్రజా పాలన 99 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో నిర్వహించిన గ్రామసభ సందర్భంగా ఆమె మాట్లాడారు. గ్రామంలో చేస్తున్న ప్రతి పనికి సంబంధించి వెచ్చించిన ప్రతి రూపాయికి గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యుల తీర్మానం మేరకు నిధులు వెచ్చించినట్లు కావాలని కొంతమంది పాలకవర్గ సభ్యులు కాంగ్రెస్ నాయకులు పంచాయతీ పాలకవర్గం సమావేశంలో ఒప్పుకుని తీర్మానించిన తర్వాత తీర్మానించలేదని తెలపడం సరికాదన్నారు.
ఈ సందర్భంగా గత ఆరు నెలల కాలంలో గ్రామంలో చేపట్టిన అభివృద్ధి శానిటేషన్ కార్యక్రమాలు వివరాలను సర్పంచ్ వివరించారు. గ్రామసభలో కాంగ్రెస్ నాయకులు నిధుల అవకతవకలపై ప్రశ్నించారు. వార్డు సభ్యులకు సమాచారం లేకుండానే సర్పంచ్ వార్డులలో తన వ్యక్తులతో పనులు చేయిస్తున్నాడని ఆరోపించారు. గతంలో అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులు రావడంతో తొలగించిన వ్యక్తిని తిరిగి కారోబార్గా నియమించే పనులు చేయించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా గ్రామ సభలో కొద్దిసేపు గందరగోల పరిస్థితి నెలకొంది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ చిక్కుల సురేష్ వార్డు సభ్యులు ఉసికె సుగుణమ్మ నర్సింలు, ఏంబరి శంకర్, మేఘమాల తదితరులు పాల్గొన్నారు.




