calender_icon.png 18 February, 2026 | 10:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

18-02-2026 08:07:13 PM

భద్రాచలం నుంచి చంద్రుపట్లకు వరకు రోడ్డు నిర్మాణకి  67 కోట్లు

మరమ్మతులకు కోటి 80 లక్షలు మంజూరు

భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలం నుంచి చంద్రుపట్ల వరకు రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వానికి రూ.67 కోట్ల ప్రపోజల్ సిద్ధం చేసి పంపించటం జరిగిందనీ. అందులో భాగంగా ముందుగా రోడ్డు తాత్కాలిక పనుల నిర్మాణం కోసం 1: 80 లక్షలు మంజూరు చేయటం జరిగిందని తెలుపుతూ భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకటరావు క్యాంపు కార్యాలయం నుండి  ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో భాగంగా కొన్ని రోజులుగా భద్రాచలం నుంచి చంద్రపట్ల వరకు రోడ్డు ప్యాచ్ వర్క్ (తాత్కాలిక నిర్మాణం) ఆర్ అండ్ బి శాఖ చేపడుతుందని తెలియజేశారు.

కొందరు కావాలని ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకటరావుపై ఆరోపణ చేయటం పరిపాటిగా మారిందనీ, ప్రతినిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడుతున్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుని కొందరు కావాలని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారనీ ఆ ప్రయత్నంలో తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచిన రెండు సంవత్సరాల లోపు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టటం జరిగిందనీ, కొన్ని పనులు పూర్తి చేశామని, మరికొన్ని శంకుస్థాపనలు, మరి కొన్ని పనులు మంజూరు చేయటం జరిగిందనీ తెలిపారు.

దుమ్ముగూడెం మండలంలోని దుమ్ముగూడెం ఎడ్ లాక్ నుంచి పర్ణశాల వరకు 60 లక్షలు మంజూరు చేయటం జరిగింది. అంతేకాకుండా భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం వాజేడు మండలాల్లో కొన్ని లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించి శంకుస్థాపన కూడా చేయటం జరిగింది. అభివృద్ధిని చూడలేని కొందరు వ్యక్తులు ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తూ, విమర్శలు చేయటం సరైనది కాదు. ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడం చూసి, విషయాన్ని జీర్ణించుకోలేని కొందరు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పై విమర్శలు చేయటం పరిపాటిగా మారింది.

నియోజకవర్గ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు నిధులు సాధించేందుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యేను టార్గెట్ చేయటం సరైనది కాదు. నియోజకవర్గం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారి కృషి ని ప్రజలు గమనిస్తేనే ఉన్నారని తెలిపారు. అతి తక్కువ కాలంలో నియోజకవర్గ సమస్యలను పరిష్కరించడంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు  ముందు వరుసలో ఉండటంతో జీర్ణించుకోలేని వారు విమర్శలు చేయటం పరిపాటిగా మారింది. ఇప్పటికైనా విమర్శలు మాని ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధికి సహకరించాలని కోరారు.