త్వరలో ఇజ్రాయెల్‌తో.. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
- మైత్రి మరింత బలపడిందన్న ప్రధాని మోదీ
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- 27 రంగాల్లో పరస్పర సహకారానికి అంగీకారం
- ఏఐ, క్వాంటం టెక్నాలజీపై కొత్త ఒప్పందం
- ఇజ్రాయెల్‌లో యూపీఐ సేవలు
- సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సంఖ్యను 100కి పెంచాలని నిర్ణయం
- ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాటం: ఇరు దేశాల స్పష్టీకరణ
జేరుసలేం, ఫిబ్రవరి 26 : ఇజ్రాయెల్--భారత్ మధ్య త్వరలోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరనుందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. అలాగే ఇజ్రాయెల్‌లో కూడా త్వరలో యూపీఐ సేవలను వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ మేరకు యూపీఐ పేమెంట్స్ విషయంలో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. యూపీఐ పేమెంట్స్‌తో పాటు ఏఐ, వ్యవసాయం తదితర రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. మొత్తం 27 రంగా ల్లో పరస్పర సహకారానికి ఇరు దేశాలు అంగీకరించాయి.
జెరూసలేంలో గురువారం ఇజ్రా యెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో కలిసి నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో మోదీ మాట్లాడారు. రెండు దేశాల మధ్య మైత్రి మరింత బలపడిందని మోదీ అన్నారు. వ్యవసాయ రంగంలో సహకారానికి సుదీర్ఘ చరిత్ర ఉందని, దీన్ని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని నిర్ణయిం చామన్నారు. ఇజ్రాయెల్ సహకారంతో భారత్‌లో ఏర్పాటు చేసిన సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ విజయవంతం కావడంతో, వాటి సంఖ్యను 100కు పెంచనున్నట్లు వెల్లడించారు.
ఉగ్రవాదానికి చోటు లేదు
ఉగ్రవాదంపై ఇరు దేశాల వైఖరి స్పష్టంగా ఉందని, దానికి ప్రపంచంలో చోటు లేదని మోదీ స్పష్టం చేశారు. గాజా శాంతి ప్రణాళిక ద్వారా శాంతికి మార్గం ఏర్పడిందని, ఈ ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతు ఇచ్చిందని పునరుద్ఘాటించారు. తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ ఇజ్రాయెల్ చారిత్రక గడ్డపై అడుగుపెట్టడం గర్వంగా, భావోద్వేగంగా ఉందని మోదీ అన్నారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ ’క్నెస్సెట్’లో ప్రసంగించే అవకాశం కల్పించినందుకు, స్పీకర్ మెడల్‌తో సత్కరించినందుకు నెతన్యాహుకు, ఇక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
హోలోకాస్ట్ మృతులకు నివాళి
ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా గురువారం ప్రధాని మోదీ హోలోకాస్ట్ మెమోరి యల్ యాద్ వషెమ్‌ను సందర్శించారు. హోలో కాస్ట్ మృతులకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. 2017లోనూ యాద్ వషెమ్ ను మోదీ సందర్శించారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో హోలోకాస్ట్లో 60 లక్షల మంది యూదులను హిట్లర్ పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. యూదులను సామూహికంగా హత్య చేయడాన్ని ’హోలోకాస్ట్’ అని పిలుస్తారు. హీబ్రూ భాషలో దీనిని ’షోవా’ అంటారు.. దీని అర్థం ’పెద్ద విపత్తు’ నిన్న(బుధవారం). టెల్ అవీవ్లోని బెన్ గురియన్ విమానాశ్రయంలో నెతన్యాహు తన భార్యతో కలిసి మోదీకి స్వాగతం పలికారు.
మోదీ పర్యటన అద్భుతం: నెతన్యాహు ప్రశంసలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన చిన్నదే అయినప్పటికీ, ఫల వంతమైందని, హృదయాలను కదిలించిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యా హు అన్నారు. గురువారం జెరూసలేంలో ఇరు నేతల మధ్య చర్చల అనంతరం ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఇది ఒక అద్భుతమైన పర్యటన. నిన్న ఇజ్రాయెల్ పార్లమెంట్ ’నెస్సె ట్’లో మోదీ చేసిన ప్రసంగం అందరి కళ్లను చెమర్చేలా చేసింది‘ అని నెతన్యాహు ప్రశంసించారు.
ఇరు దేశాల్లోని ప్రతిభావంతుల మధ్య సహకారం గురించి చర్చించామని, వాటిని నిర్దిష్ట ప్రణాళికలుగా మారుస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా భారత్‌లో ప్రభుత్వ స్థాయి సమావేశం నిర్వహిం చాలని నిర్ణయించినట్లు ఆయన ప్రకటించారు. ఇది ఇరు దేశాల మధ్య సంబంధాల ను మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మోదీ నాయకత్వం లోని భారత ప్రభుత్వం చాలా సమర్థవంతంగా పనిచేస్తోందని నెతన్యాహు కితాబి చ్చారు. ‘ఆవిష్కరణలను అందిపుచ్చుకున్న వారికే భవిష్యత్తు ఉంటుంది. భారత్, ఇజ్రాయెల్ గర్వించదగిన ప్రాచీన నాగరికతలు. భవిష్యత్తును అందిపుచ్చుకోవడానికి మేం నిశ్చయించుకున్నాం. కలిసికట్టుగా మరింత అభివృద్ధి సాధించగలం’ అని అన్నారు.




