రైతుల కోసమే ఉచిత వైద్య శిబిరం
బెజ్జూర్,(విజయ క్రాంతి): బెజ్జూర్ మండలంలోని సోమీని రైతు వేదికలో బుధవారం రైతుల కోసం ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసినట్లు మన గ్రోమోర్ సెంటర్ మేనేజర్ కార్తీక్ తెలిపారు.రైతు సంక్షేమమే ధ్యేయంగా మన గ్రోమోర్ సెంటర్ ఆధ్వర్యంలో సోమిని గ్రామ పరిధిలోని రైతులందరికీ ఉచిత వైద్య పరీక్షలు,అవగాహన సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. మన గ్రోమోర్ సెంటర్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
బీపీ,పల్స్,జ్వరం,నొప్పులు,బలహీనత తదితర అనారోగ్యల పైన అవహాగణ శరీర భౌతిక పరీక్ష పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు.ఈ వైద్య శిబిరంలో 80 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రోమోర్ సెంటర్ మేనేజర్ కార్తీక్, వైద్య సిబ్బంది,మాజీ జెడ్పిటిసి పుష్పలత,గ్రామ సర్పంచ్ సరిత,తిరుపతి,,బ్రహ్మయ్య గణేష్,రామేష్ ఉప సర్పంచ్ సూర్య,రామన్న,మాజీ ఎంపీటీసీ అత్రం సాయి తదితరులు పాల్గొన్నారు.






