21 March, 2026 | 1:33 PM

Breaking News

తస్మాత్ జాగ్రత్త.. సమోసా, పఫ్స్ ప్రియులకు షాకింగ్ సీన్   •   రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం, డిప్యూటీ సీఎం   •   'శ్రమ మాది.. శిలాఫలకాలు మీవి'.. రిబ్బన్ కటింగ్ చేయడమే కాంగ్రెస్ పని   •   వేరే వ్యక్తిని పెండ్లి చేసుకుందని.. తండ్రితో వెళ్లి మహిళపై ప్రియుడు దాడి   •   యువకుడి ప్రాణం తీసిన పెళ్లి ప్రపోజల్‌.. పండగ పూట తీవ్ర విషాదం   •   కరీంనగర్ టూటౌన్ ఎస్ఐ ఆత్మహత్య.. అనాథలుగా మారిన చిన్నారులు   •   మార్కెట్‌లోకి 14 కోట్ల బ్యారళ్ల ఇరాన్ చమురు.. అమెరికా ఆంక్షలు ఎత్తివేత   •   హార్ముజ్ జలసంధి గురించి మాకు అవసరం లేదు.. వారికి ధైర్యం లేదు   •   కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధిగా బండారి గంగాధర్   •   నవోదయకు ఎంపికైన పోకల తనుష్   •  

ఉచిత ఆరోగ్య శిబిరం

21-03-2026 12:00 AM

విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ

‘ఐఐఎంసీ’ ఆధ్వర్యంలో కార్యక్రమాలు

ఖైరతాబాద్ , మార్చి 20 (విజయక్రాంతి): ఐఐఎంసి కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్‌లో గల తిమ్మాయిపల్లి, ధర్మారం గ్రామాల్లో జాతీయ సేవా పథక ప్రత్యేక శిబిరం ఏడు రోజుల పాటు నిర్వహించారు. అందులో భాగంగా మూడోరోజు మార్చి 18 తేదీన తిమ్మాయిపల్లిలోని కురుమ సంఘం సహకారంతో ది డెక్కన్ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ వారి సౌజన్యంతో ఉచిత ఆరోగ్య శిబిరం ఏ ర్పాటు చేశారు.

యూనిట్ 1 ప్రోగ్రాం ఆఫీసర్ సత్యనారాయణ, యూనిట్ 2 ప్రోగ్రాం ఆఫీసర్ ఇ.రామకృష్ణ, కురుమ సంఘం అధ్యక్షులు బీరప్ప ప్రారంభించారు. సికింద్రాబాద్లోని మెడికవర్ హాస్పిటల్ డాక్టర్లు జనర ల్ చెకప్, బ్లడ్ షుగర్ పరీక్షలు చేశారు. ఎస్సార్ నగర్లోని అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ డాక్టర్లు కంటి పరీక్షలు చేశా రు. మార్చి 19న వలంటీర్లు జనహిత సేవా ట్రస్ట్ లో పరాభవ నామ తెలు గు సంవత్సరాది ఉగాదిని సాంప్రదాయం బద్దంగా జరుపుకొన్నారు.

మార్చి 20న తిమ్మాయిపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఐఐ ఎంసి కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ చైర్మన్, ప్రిన్సిపల్ కూర రఘువీర్ 100 మందికి 200 నోట్ పుస్తకాలు అందజేశారు. పాఠశాల హెచ్‌ఎం జగన్మోహన్ పాల్గొన్నారు. జనహిత సేవా సంస్థ నిర్వహిస్తున్న మానసిక వైకల్యం గల పిల్లల కోసం 26 మంది విద్యార్థులకు పుస్తకాలు, స్టేషనరీ అందజేశారు. కూర రఘువీర్ ఈ సంస్థకు రూ.50వేలు విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో జనహిత సేవా సంస్థ ట్రస్టీలు నరసింహమూర్తి, శ్రీధర్, శ్రీదేవి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు ఇ రామకృష్ణ, ఎం సత్యనారాయణ, అధ్యాపకులు విజయ్, ఆశ్లేష పాల్గొన్నారు.