కేవైసీ పేరుతో సైబర్ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలి: సీఐ వెంకట్‌రెడ్డి
20-08-2026 09:32 PM
సిర్గాపూర్/కల్హేర్/కంగ్టి,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కంగ్టి సీఐ వెంకట్‌రెడ్డి ప్రజలకు ముందస్తు హెచ్చరిక కేవైసీ (KYC) అప్డేట్ పేరుతో సైబర్ మోసగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని సీఐ వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. బ్యాంకు ఖాతా, ఆధార్ లేదా ఇతర వివరాలను అప్డేట్ చేయాలంటూ వచ్చే అనుమానాస్పద ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, లింక్‌లకు స్పందించవద్దని సూచించారు. బ్యాంకు వివరాలు, ఓటీపీ, పిన్, పాస్‌వర్డ్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ చెప్పకూడదని తెలిపారు. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయకుండా, మోసానికి గురైతే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సీఐ వెంకట్‌రెడ్డి సూచించారు.






