calender_icon.png 21 February, 2026 | 2:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చోర్పల్లి మాజీ సర్పంచ్ కమ్మరి బాయక్క కన్నుమూత

21-02-2026 12:27:11 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలం చోర్పల్లి గ్రామ మాజీ సర్పంచ్ కమ్మరి బాయక్క (75)  శుక్రవారం రాత్రి కన్నుమూశారు. ప్రస్తుత చోర్పల్లి గ్రామ సర్పంచ్‌, కాంగ్రెస్ పార్టీ నాయకులు కమ్మరి పెంటయ్య తల్లి  బాయక్క కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు.బాయక్క  కుటుంబం గత 20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా కొనసాగుతూ గ్రామాభివృద్ధి, పార్టీ బలోపేతానికి సేవలందిస్తోంది.

బాయక్క  సర్పంచ్‌గా ఉన్న సమయంలో గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆమె మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ ఉపసర్పంచ్ చిట్ల నారాయణ, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాయక్క మరణం పార్టీకి, గ్రామానికి తీరని లోటని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.బాయక్క  అంత్యక్రియలు నేడు చోర్పల్లి గ్రామంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.