calender_icon.png 13 February, 2026 | 5:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

13-02-2026 12:00:00 AM

నాగిరెడ్డిపేట్,ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): మండలంలోని నాగిరెడ్డిపేట గ్రామ టిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కిచ్చయ్యగారి దీపక్ రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి మొన్న మృతి చెందడంతో నిన్న జరిగినటువంటి అంత్యక్రియల్లో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పార్దివ దేహానికి పూలమాలలు వేసి ప్రగాఢ సానుభూతి తెలియజేసి కుటుంబ సభ్యులను ఓదార్చారు.అంత్యక్రియలు అయ్యేవరకు మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ దీపక్ రెడ్డి వెన్నంటి ఉన్నాడు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసిలు ఉమన్నగారి మనోహర్ రెడ్డి,జగ్గీ జయరాజ్,నాయకులు వంశీకృష్ణ గౌడ్,వెంకట్ రెడ్డి, కాంతారెడ్డి,హనుమంత్ రెడ్డి, సాయిబాబా,నరసింహారెడ్డి, శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.