23 June, 2026 | 4:01 AM

బాధిత కుటుంబాలకు మాజీ డిప్యూటీ స్పీకర్ పరామర్శ

23-06-2026 12:00 AM

మెదక్, జూన్ 22(విజయక్రాంతి) : మెదక్ జిల్లా శంకరంపేట మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన తొర్రి దుర్గయ్య కుమార్తె, చేవెళ్ల దుర్గయ్య కోడలు హిందూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, అలాగే ధరిపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ అంజగౌడ్ అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్ రెడ్డి సోమవారం బాధిత కుటుంబాలను పరామర్శించారు.

ఈ సందర్భంగా తొర్రి దుర్గయ్య, చేవెళ్ల దుర్గయ్య, మల్గ నారాయణ, అంజగౌడ్ కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, అనారోగ్యంతో ఇద్దరు మృతి చెందడం అత్యంత బాధాకరమని అన్నారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబాలకు భారత రాష్ట్ర సమితి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో శంకరంపేట (ఆర్) మండల అధ్యక్షుడు పట్లోరి రాజు, రైతుబంధు మాజీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, సర్పంచ్లు మానస మహిపాల్రెడ్డి, గొండస్వామి, ఇమ్మడి నరేష్, మాజీ సర్పంచ్లు మంచాల లక్ష్మణ్, శ్రీనివాస్రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్, మండల నాయకులు బందేల ప్రభాకర్, లాలూ నాయక్, ఎం. శ్రీనివాస్, అత్తెలి నాగరాజు, వెంకట్రాం రెడ్డి, సుంకరి వెంకట్ గౌడ్, షేర్ స్వామి, ఉప్పరి శ్రీనివాస్, రవి, కర్రీ రాజు, శేఖర్ రెడ్డి, సత్తయ్య, పోచయ్య, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.