22 May, 2026 | 12:48 AM

ఘనంగా ఫుడ్ కమిషన్ చైర్మన్ జన్మదిన వేడుక

22-05-2026 12:02 AM

ఆమనగల్లు, మే21 (విజయక్రాంతి): రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు కల్వకుర్తి నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆమనగల్లు, కడ్తాల్, మాడ్గుల, తలకొండపల్లి మండల కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్బంగా గోలి సమక్షంలో కేక్ కట్ చేసి, శాలువాతో ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్, మాజీ జడ్పీటీసీ సభ్యుడు దశరథ్ నాయక్, మాజీ సర్పంచ్ లక్ష్మీనరసింహారెడ్డి, ఖలీల్, వెంకటయ్య, బాలస్వామి,సైదులు రమేష్, వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.