6 August, 2026 | 3:51 AM

సందీప్ కిషన్.. కరికాల

06-08-2026 12:00 AM

‘శంబాల’ బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు యుగంధర్ ముని సందీప్ కిషన్‌తో ఓ ప్రాజెక్టును ప్రకటించారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్‌రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్న ఈ మూవీ టైటిల్‌ను రివీల్ చేస్తూ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘కరికాల’ అనే పేరుతో ఈ చిత్రం రాబోతోంది.

టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో సందీప్ కిషన్.. చేతిలో ఖడ్గం పట్టుకొని, గుర్రంపై స్వారీ చేస్తూ, సింహాన్నే పరిగెత్తిస్తున్నట్టు కనిపించారు. ఈ సోషియో-ఫాంటసీ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ చాప్టర్ 2027, జూలై 2న విడుదల కానుండగా, రెండో చాప్టర్ అదే ఏడాది అక్టోబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలను నిర్మాతలు తర్వాత వెల్లడించనున్నారు.