18 June, 2026 | 7:19 PM

యూరియా యాప్ రద్దు చేయాలి.. అన్నదాతను కాపాడాలి!

18-06-2026 05:35 PM

ఎల్లారెడ్డి నియోజకవర్గ స్థాయి రైతులతో ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే, జాజాల సురేందర్

ఎల్లారెడ్డి జూన్ 18 (విజయక్రాంతి): ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో గురువారం మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో, నిర్వహించిన యూరియా యాప్ రద్దు చేయాలని రైతు ధర్నా కార్యక్రమంలో ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు జాజాల సురేందర్  పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే  మాట్లాడుతూ-దేశానికి వెన్నెముక రైతు... కానీ ఈరోజు అదే రైతును టెక్నాలజీ పేరుతో ఇబ్బందుల పాలు చేయడం ఎంతవరకు న్యాయం అని రైతుల పక్షాన ప్రశ్నించారు. యూరియా కొనుగోలుకు ప్రవేశపెట్టిన కొత్త యాప్ విధానం వల్ల సామాన్య రైతులకు ఎన్నో కష్టాలు ఎదురవుతున్నాయి వెంటనే ఈ యాప్ రద్దు చేయాలనీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

స్మార్ట్‌ఫోన్లు లేని నిరక్షరాస్యులైన రైతులు పల్లెల్లో ఉండే చాలా మంది వృద్ధులు, చదువుకోని రైతులకు స్మార్ట్‌ఫోన్లు వాడటం, యాప్‌లో రిజిస్టర్ చేసుకోవడం తెలియదని అన్నారు.సర్వర్ మరియు సిగ్నల్ సమస్యలతో గ్రామీణ ప్రాంతాల్లో సరైన ఇంటర్నెట్ సిగ్నల్స్ ఉండవని యాప్ సర్వర్ డౌన్ అయిన ప్రతిసారీ గంటల తరబడి ఎండలో వేచి ఉండాల్సి వస్తోంది. సకాలంలో దొరకని ఎరువులు - పంటకు యూరియా వేయాల్సిన సరైన సమయంలో యాప్ సమస్యల వల్ల ఆలస్యమైతే, పంట దిగుబడి దెబ్బతింటుందని అన్నారు. రైతులపై అదనపు భారం యాప్ రిజిస్ట్రేషన్ల కోసం నెట్ సెంటర్ల చుట్టూ తిరగాల్సి రావడం వల్ల డబ్బు, సమయం వృథా అవుతున్నాయని అన్నారు.

 సాంకేతికత అనేది రైతు పనిని సులువు చేయాలి... అంతే కానీ, వాళ్లను ఇక్కట్ల పాలు చేయకూడదని సూచించారు.గతంలో లాగా ఆధార్ కార్డు లేదా పట్టాదారు పాస్ పుస్తకం చూపిస్తే నేరుగా యూరియా ఇచ్చే పాత పద్ధతినే కొనసాగించాలి. ఈ సంక్లిష్టమైన యాప్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి రెండు రోజులలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని అని సెంటర్ లలో యూరియా అందుబాటులో ఉంచి రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ లేని పక్షాన రైతులను ఏకం చేసి ఈ ప్రభుత్వాన్ని స్తంభింపజెస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండలాల బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతులు అధిక సంఖ్యలో ధర్నాలు పాల్గొని మాజీ ఎమ్మెల్యే సురేందర్ కు మద్దతునిచ్చారు