26 June, 2026 | 7:42 PM

ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక

26-06-2026 06:12 PM

రుద్రంగి,(విజయక్రాంతి): ప్రజాసేవే లక్ష్యంగా నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా పని చేస్తున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసత్య ఆరోపణలను రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎర్రం గంగానర్సయ్య తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఎర్రం గంగానర్సయ్య మాట్లాడుతూ... స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను రాజకీయంగా ఎదుర్కోలేక ప్రతిపక్ష పార్టీలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయన్నారు.

ప్రజల మనసును గెలుచుకుని ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజాసేవే లక్ష్యంగా పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌పై జరుగుతున్న అసత్య ప్రచారం అత్యంత ఖండనీయం అన్నారు. ఇదే ధాన్యం అక్రమ కేసులో బిఆరెస్ పార్టీకి చెందిన మదుకర్ అనే వ్యక్తి ఉన్నడాని మరి ఇందులో చల్మేడ లక్ష్మీనరసింహరావు హస్తం ఉన్నంటేన అని ప్రశ్నించారు.కానీ మెమెప్పుడు అలా విమర్శించలేదని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని, రాజకీయ ప్రత్యర్థుల గౌరవాన్ని సైతం సంపాదించుకున్న నాయకుడిపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడం కొందరి రాజకీయ దివాళాకోరుతనాన్ని, నిరాశను బహిర్గతం చేస్తోందని అన్నారు.

ఇటీవల ధాన్యం అక్రమ రవాణా కేసు నేపథ్యంలో కొందరు ఉద్దేశపూర్వకంగా ఆది శ్రీనివాస్ పేరును లాగేందుకు ప్రయత్నించడం అత్యంత బాధ్యతారాహిత్యమైన చర్య. ఒక కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి సోదరుడు కాంగ్రెస్ నాయకుడు అనే కారణంతో రాష్ట్ర ప్రభుత్వ విప్‌ను ఆ కేసుతో ముడిపెట్టడం వాస్తవాలను వక్రీకరించడం మాత్రమే కాకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసారని.చట్టం ముందు ఎవరూ అతీతులు కారని, ఎవరైనా తప్పు చేసి ఉంటే చట్టం తన పని తాను చేసుకుంటు పోతుందని అన్నారు. ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని, ముఖ్యంగా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న ఒక ప్రజాప్రతినిధిని రాజకీయ కుట్రల్లో భాగంగా లక్ష్యంగా చేసుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అని అన్నారు.ఇకముందు ప్రభుత్వ విప్ పై అసత్యపు ఆరోపణలు చేస్తే ప్రతిపక్ష పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.