27 March, 2026 | 1:59 PM

Breaking News

శ్రీశైల క్షేత్రంలో వైభవంగా సీతారాముల కల్యాణం.!   •   దేశంలో తగినంత ఎరువుల నిల్వలున్నాయి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు — నడ్డా   •   బాలుడి కన్ను గుడ్డు పీకేసిన వీధి కుక్కలు   •   భారత్‌లో మళ్లీ లాక్‌డౌన్‌?.. కేంద్రమంత్రి సంచలన ప్రకటన   •   రాజాసింగ్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి శోభాయాత్ర.. ధూల్‌పేటలో ప్రారంభం   •   భద్రాచలంలో కన్నులపండువగా సీతారాముల కల్యాణోత్సవం   •   పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం గుడ్‌న్యూస్   •   శ్రీరామనవమి వేళ.. 48 ఆవులను కాపాడిన భజరంగ్ దళ్, హిందూ వాహిని సభ్యులు   •   హైదరాబాద్‌లో వైభవంగా శ్రీరామ శోభాయాత్ర.. ట్రాఫిక్ ఆంక్షలు   •   తుంగతుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా అన్నపర్తి జ్ఞాన సుందర్   •  

సింగరేణి సంస్థలో జేవీఆర్‌బీ సైడింగ్‌లో విస్తృత తనిఖీలు

27-03-2026 12:00 AM

సింగరేణి, మార్చి 26: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) పరిధిలోని సత్తుపల్లి ఏరియాలో ఉన్న జేవీఆర్బీ సైడింగ్లో భద్రతా అంశాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జనరల్ మేనేజర్, చీఫ్ సివిల్ ఇంజనీర్, డివిజనల్ రైల్వే మేనేజర్ సహా ఉన్నతాధికారుల బృందం సైడింగ్ ప్రాంతాన్ని పరిశీలించి, రైల్వే సిగ్నలింగ్, డిస్పాచ్, లోడింగ్ కార్యకలాపాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించింది.

ఈ సందర్భంగా జేవీఆర్బీ సైడింగ్లో నిర్వహణ, సిగ్నలింగ్ మరియు ట్రాఫిక్ వ్యవస్థకు సంబంధించిన పలు అంశాలపై అధికారులు చర్చించి, అవసరమైన మెరుగుదల చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, రైల్వే కార్యకలాపాలు సురక్షితంగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ తనిఖీలలో సైడింగ్ సూపరింటెండెంట్, సీనియర్ డీసీఎం, సీనియర్ డీఓఎం, ఎస్‌ఓ టు జీఎం, చీఫ్ ఇంజనీర్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.