ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్ల డోర్ డెలివరీ టెండర్ గడువు మరోసారి పొడిగింపు
ఇల్లెందు,(విజయక్రాంతి): సింగరేణి సంస్థ ఇల్లందు ఏరియాలో గృహ వినియోగదారులకు సరఫరా చేయబడుతున్న HPCL, BPCL కంపెనీల LPG గ్యాస్ సిలిండర్లను గోదాముల నుండి వినియోగదారుల ఇళ్లకు డోర్ డెలివరీ చేయుటకు అధీకృత డీలర్ల నుండి యూనిట్ రేట్ విధానంలో టెండర్లు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ టెండర్ దరఖాస్తుల స్వీకరణకు ముందుగా నిర్ణయించిన గడువును సంస్థ యాజమాన్యం మరోసారి పొడిగించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 18.05.2026 సాయంత్రం 03:30 గంటల వరకు ఉన్న గడువును, ఇప్పుడు 23.05.2026 సాయంత్రం 03:30 గంటల వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు.
ఆసక్తి గల టెండర్ దరఖాస్తుదారులు రూ.102/- దరఖాస్తు ఫీజును ఇల్లందు జీఎం కార్యాలయంలోని ఫైనాన్స్ విభాగంలో చెల్లించి టెండర్ దరఖాస్తు ఫారంను పొందవచ్చని తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను 23.05.2026 మధ్యాహ్నం 03:30 గంటలలోపు జీఎం కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. కావున ఆసక్తి గల టెండర్ దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు పర్చేజ్ విభాగం, జీఎం కార్యాలయం, ఇల్లందు ఏరియాను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.






