వేసవిలో ప్రోటీన్ ఆహారాన్నే సూచిస్తున్న నిపుణులు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: వేసవి ముందుగానే వచ్చేసింది, బీచ్ ట్రిప్పులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి, మీ ఫిట్‌నెస్ దినచర్యను ప్రారంభించడానికి ఇదే సరైన సమయం. జిమ్ సెషన్‌లు ఎంత అవసరమో, ఆరోగ్యకరమైన శరీర బరువును తీర్చిదిద్దడంలో, నిర్వహించడంలో ఆహారం కూడా అంతే ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. న్యూ ఢిల్లీలోని మాక్స్ హెల్త్‌కేర్ – డైటెటిక్స్ రీజినల్ హెడ్ అయిన రితికా సమద్దార్, కాలిఫోర్నియా బాదం, గ్రీక్ యోగర్ట్ మరియు సాల్మన్‌తో కూడిన సరళమైన, ప్రోటీన్ అధికంగా ఉండే ప్రణాళికను సిఫార్సు చేస్తున్నారు.
ప్రతీ రోజును కొన్ని కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రారంభించండి. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఇ , మెగ్నీషియం పుష్కలంగా కలిగిన బాదం గింజలు అకస్మాత్తుగా శక్తి స్థాయి పెరగకుండా స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి. ఫిట్‌నెస్‌పై దృష్టి సారించే ఏ ఆహారానికైనా ఇవి ఒక అద్భుతమైన పోషకపు జోడింపుగా నిలుస్తాయి.
సంపూర్ణ ప్రోటీన్ కోసం వీటిని రెండు ఉడికించిన గుడ్లతో జత చేయండి. ఈ కాంబో సులభంగా తీసుకువెళ్లటానికి కూడా అనువుగా ఉంటుంది , ఉరుకుల పరుగుల ఉదయపు సమయాలలో కడుపు నింపడానికి సరైనది. మధ్యాహ్న భోజనంలోగ్రిల్ చేసిన చికెన్ బ్రెస్ట్‌ను మిక్స్‌డ్ గ్రీన్స్, చెర్రీ టొమాటోలు , దోసకాయతో కలిపి తీసుకోండి. ఈ భోజనం కూరగాయల నుండి లీన్ ప్రోటీన్, ఫైబర్ మరియు హైడ్రేషన్ అందిస్తుంది, మధ్యాహ్నం అంతా మిమ్మల్ని సంతృప్తిగా ఉంచుతుంది.
సాయంత్రపు స్నాక్ గా ఒక టీస్పూన్ చియా గింజలు చల్లుకున్న గ్రీక్ యోగర్ట్‌తో శక్తిని పునరుద్ధరించుకోండి. ఈ స్నాక్ పేగు ఆరోగ్యం కోసం ప్రోబయోటిక్స్, నిరంతర శక్తి అందిస్తుంది. తాజా , చల్లదనపు ప్రభావాన్ని శరీరానికి అందిస్తుంది. ఇక రాత్రి భోజనంలో :
ఉడికించిన క్వినోవా మరియు ఆవిరి మీద ఉడికించిన బ్రోకలీతో పాటు బేక్ చేసిన సాల్మన్ ఫిల్లెట్‌తో మీ రోజును ముగించండి. పోషకాలు అధికంగా ఉండే ఈ ప్లేట్ చర్మ ఆరోగ్యం కోసం ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ ప్రయోజనాలు మరియు రాత్రిపూట కండరాల మరమ్మత్తుకు మద్దతు ఇచ్చే సంపూర్ణ ప్రోటీన్‌లను అందిస్తుంది. ఈ సులభమైన దినచర్య కండరాల నిర్మాణానికి మద్దతు ఇవ్వడం, ఆకలిని నియంత్రించడం మరియు బరువు నిర్వహణకు సహాయపడటంపై దృష్టి పెడుతుంది. మధ్యాహ్నం పూట జీర్ణం కావడానికి కష్టంగా ఉండే అధిక కార్బోహైడ్రేట్లను నివారించండి. పరిమాణ నియంత్రణ, మంచి హైడ్రేషన్ , తేలికపాటి వ్యాయామంపై దృష్టి పెట్టండి. వేసవి ఎండలో కూడా మీరు ఫిట్‌గా, ఉత్సాహంగా ఉండటానికి ఈ సులభమైన, ఆచరణాత్మక చిట్కాలు సహాయపడతాయి.




