calender_icon.png 10 February, 2026 | 9:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పురపాలక ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం

10-02-2026 07:25:09 PM

హనుమకొండ జిల్లాఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): పురపాలక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. హనుమకొండ జిల్లాలోని పరకాల పురపాలక సంఘంలోని 22 వార్డులకు బుధవారం పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. మంగళవారం పరకాలలోని గణపతి ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్నికల సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ పంపిణీ కోసం డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి ఎంతమంది పిఓలు, ఏపీవోలు ఓపివోలు, మైక్రో అబ్జర్వర్లులను, స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపునకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు.

కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లను గురించి అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ప్రొజెక్టర్ స్క్రీన్ పెట్టాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ పరకాల మున్సిపాలిటీలోని 22 వార్డు స్థానాలకు 44 పోలింగ్ కేంద్రాలలో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. కౌంటింగ్ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి పరకాల ఆర్డిఓ డాక్టర్ కన్నం నారాయణ, పరకాల మున్సిపల్ కమిషనర్ అంజయ్య, పరకాల తహసిల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీవో రవీందర్, టిపిఓ సుష్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.