6 August, 2026 | 3:49 AM

ఎపిక్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్

06-08-2026 12:00 AM

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజాచిత్రం ‘ఎపిక్’. దర్శకుడు ఆదిత్య హాసన్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, తాజాగా తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ప్రకటించింది. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. హేషామ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. 

రణబాలి డేట్ మారనుందా..? 

విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘రణబాలి’ సినిమాను సెప్టెంబర్ 11న విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. తాజా పరిణామాల ప్రకారం ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉంది. ఎందుకంటే, విజయ్ తమ్ముడు ఆనంద్ ‘ఎపిక్’ సినిమా రిలీజ్ డేట్ సెప్టెంబర్ 11గా ప్రకటించారు నిర్మాతలు.  ఈ కారణంగానే తమ్ముడు ఆనంద్ కోసం అన్న విజయ్ తన ‘రణబాలి’ని మరో తేదీకి తీసుకు రానున్నారని టాక్. ‘రణబాలి’ని అక్టోబర్‌లోనే విడుదల చేసే ఛాన్స్ ఉందని సమాచారం. అయితే, ‘రణబాలి’ రిలీజ్ డేట్ మారే విషయమై ఇప్పటివరకైతే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న నటిస్తోంది.