21 August, 2026 | 11:54 AM

Breaking News

ప్రైవేట్ స్కూళ్లపై ఫిర్యాదుకు ఆన్‌లైన్ వ్యవస్థ ఏర్పాటు చేసిన విద్యాశాఖ

21-08-2026 12:00 AM

హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): ప్రైవేట్ పాఠశాలలపై ఫిర్యాదు నమోదు, పర్యవేక్షణకు ఆన్‌లైన్ వ్యవస్థను పాఠశాల విద్యాశాఖ తీసుకొచ్చింది. గురువారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రైవేట్ బడులపై ఫిర్యాదులు, సమస్యలను నమోదు చేసేందుకు ఆన్‌లైన్ ప్రవైట్ స్కూల్ కంప్లుంట్ మానిటరింగ్ సిస్టమ్ (పీఎస్‌సీఎంఎస్) అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. ఫిర్యాదులను అధికారుల దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు తీసుకోనున్నారు.