21 August, 2026 | 11:30 AM

విదేశీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా

21-08-2026 10:25 AM

అమరావతి: విదేశల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగ యువతను ఇద్దరు దంపతులు మోసం చేసిన ఘటన విశాఖ పట్నం జిల్లాలో వెలుగు చూసింది. 19 మంది యువతను ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వారి వద్ద నుంచి రూ.65లక్షలు దండుకున్నారు. విద్యార్థులు మోసాన్ని గ్రహించి వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో వారి బాగోతం బయటకు వచ్చింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి సౌజన్యను అదుపులోకి తీసుకున్నారు. సౌజన్య దంపతులుపై పలు ప్రాంతాల్లో కేసులు కూడా నమోదైనట్లు పోలీసులు తెలిపారు.