calender_icon.png 19 February, 2026 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్య, ఆరోగ్యానికి పెద్దపీట

19-02-2026 01:10:52 AM

యుద్ధ ప్రాతిపదికన హాస్టల్ భవనాల మరమ్మతులు

  1. దేశంలోనే మోడల్‌గా అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు 
  2. లక్ష కోట్లకు పైగా నిధులతో రహదారుల నిర్మాణం
  3. ప్రీ బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి
  4. పంట మార్పిడికి అవకాశాలు పరిశీలించాలి: మంత్రి ఉత్తమ్

హైదరాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఆరోగ్యా నికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని, ఈ రంగాల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఎన్ని నిధులైన ఖర్చు చేసేందు కు రాష్ట్ర ప్రభుత్వం వెనుకాడబోదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మైనారిటీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, రోడ్డు రవాణా, నీటిపారుదల శాఖ, సివిల్ సప్లయీస్, రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల ప్రీ బడ్జెట్ సమావేశాలు జరిగాయి.

మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్‌లతో కలిసి డిప్యూటీ సీఎం ప్రీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించారు.  ఆలోచించి, నిబద్ధతతో ప్రాధాన్య తను గుర్తించి, ఆదాయం ఖర్చుపై దృష్టి సారించి బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు.

వరి స్థానంలో పామ్ ఆయిల్, పప్పు ధాన్యాలు సాగుచేస్తూ, పంట నిల్వల స్టోరేజీ సామర్థ్యాన్ని రాష్ర్టం లో పెంచాల్సిన అవసరం ఉందని డిప్యూ టీ సీఎం తెలిపారు. వరి సాగు పెద్దఎత్తున చేయడం, బాయిల్డ్ రైస్‌ను తమిళ నాడు వంటి రాష్ట్రాలు కొనుగోలు చేయకపోవడం వలన భవిష్యత్‌లో రాష్ట్ర రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని, అందుకే పంట మార్పిడికి అవకాశాల ను పరిశీలించాలని నీటిపారుదల శాఖ సమావేశంలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సూచిం చారు.

మైనార్టీ సంక్షేమ శాఖ సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. సంక్షేమ శాఖకు సంబంధించి వసతిగృహాలు, గురుకులాల బిల్లులు ఎంత తొందరగా పంపితే అంత తొం దరగా క్లియర్ చేస్తామని, వసతిగృహాల భవనాల మరమ్మత్తులు వేగంగా పూర్తిచేయాలని డిప్యూటీ సీఎం మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రపంచస్థాయి ప్రమా ణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూ ల్స్ నిర్మిస్తున్నామని, అన్నివర్గాల విద్యార్థులు ఉమ్మడి కుటుంబంలా కలిసిపోవడమే ప్రభు త్వ లక్ష్యం అని అన్నారు. 

సోలార్ పవర్ ఏర్పాటు చేయాలి.. 

వసతి గృహాలు, రెసిడెన్షియల్ బిల్డింగ్‌ల పైన సోలార్ పవర్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీతో సమావేశమై ఏర్పాటు చేసుకోవాలని కరెంటు భారం లేకుండా చేసుకోవడమే కాదు, సోలార్ ద్వారా ఆదాయం సృష్టించుకోవచ్చని తెలిపారు. వసతి గృహాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్న నేపథ్యంలో జిల్లా అధికారులు, రాష్ట్రస్థాయి అధికారులు వసతి గృహాలను సందర్శించి అన్ని విషయాలను పరిశీలించాలని వీలైతే ఒక రోజు రాత్రి అక్కడే బస చేయాలని గతంలోనే ఆదేశించాం.

ఆ ప్రక్రియ ఎంత మేరకు కొనసాగుతుందో సెక్రటరీలు ఆయా జిల్లా కలెక్టర్ల ద్వారా పర్యవేక్షణ జరపాలని డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి వసతిగృహాల అద్దెలను క్లియ ర్ చేస్తున్నామని తెలిపారు. హాస్టల్ బిల్డింగుల మరమ్మతు బిల్లులు పంపిస్తే క్లియర్ చేస్తామని డిప్యూ టీ సీఎం తెలిపారు. 

బీసీలకు ప్రాధాన్యత.. 

బీసీ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు గ్రీన్ చానెల్ ద్వారా డైట్  కాస్మొటిక్ ఛార్జీలు విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు విడుదల చేస్తుందనీ డిప్యూటీ సీఎం తెలిపారు. ఈసారి బడ్జెట్‌లో బీసీలలో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి  వారి ఆర్థిక వృద్ధి సాధించడానికి ప్రత్యేక పథకాలు ప్రారంభించాలని కోరడం జరిగిందనీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. త్వరలోనే ఆర్టీసీలో ప్రయాణించే మహిళలకు మహాలక్ష్మీ కార్డులను ప్రతి ఇంటింటా అందిస్తామన్నారు. 

రహదారుల నిర్మాణం.. 

లక్ష కోట్లకు పైగా నిధులతో రాష్ర్టంలో రహదారుల నిర్మాణం జరుగుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. హ్యామ్, ట్రిపుల్‌ఆర్, హైదరాబాద్- విజయవాడ, ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టు, రావిర్యాల నుంచి శ్రీశైలం వరకు రహదారుల నిర్మాణం పనులు విదశలో ఉన్నాయన్నారు. రాష్ర్టంలో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి హడ్కో నుంచి రుణం తీసుకునేందుకు భట్టి విక్రమార్క ప్రీబడ్జెట్ సమావేశంలో సంతకం చేసి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభినందనలు తెలిపారు. 

అంబేద్కర్ నాలేడ్జ్ సెంటర్లు.. 

గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు సివి ల్స్, గ్రూప్స్ వంటి పోటీపరీక్షల కోసం హైదరాబాద్‌కు వచ్చి ఆర్థికంగా, ఇతరత్రా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు నియోజకవర్గ కేంద్రాల్లో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ప్రారంభించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని డిప్యూటీ సీఎం  భట్టి విక్రమార్క వివరించారు.

లోయర్ ట్యాంక్‌బండ్, కాచిగూడ కేంద్రంలో ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉన్న విలువైన స్థలాల్లో భారీ బవంతులు నిర్మించి విద్యార్థులకు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందు కు భవనాలు నిర్మించేలా ప్లాన్ చేయాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. సంక్షేమ వసతిగృహాలు, హాస్ట ల్లో మోడల్ కిచెన్లు ఏర్పాటుచేసే ఆలోచనను పరిశీలించాలని ఈ ప్రక్రియను దశలవారీగా ప్రారంభించాలని అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు.