17 May, 2026 | 3:36 AM

నేడు ఎప్‌సెట్ ఫలితాలు

17-05-2026 12:00 AM

3 లక్షలకు పైగా పరీక్ష రాసిన విద్యార్థులు

హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): నేడు ఎప్‌సెట్ ఫలితాలు విడుదల కానున్నా యి. వీటి ఆధారంగా విద్యార్థులకు 2026 27 విద్యా సంవత్సరానికిగానూ ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవే శాలు కల్పిస్తారు. ఆదివారం ఉదయం 11 గంటలకు జేఎన్టీయూహెచ్ వర్సిటీలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు ఫలితాలు విడుదల చేయనున్నారు.

ఈనెల 4, 5 తేదీల్లో అగ్రికల్చర్ ఫార్మసీ విభాగానికి పరీక్షలు జరగ్గా, 9 నుంచి 11 వరకు ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు నిర్వహించారు. దాదాపు 3 లక్షలకుపైగా విద్యార్థులు ఎప్‌సెట్ రాశా రు. ఇటీవల ప్రాథమిక కీ విడుదల చేసి అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు ఫలితాలు విడుదల చేస్తున్నారు.