10 April, 2026 | 3:28 PM

Breaking News

ఉపాధి హామీ పనులు వేసవిలో ఉదయం పూట చేసుకోవాలి   •   'ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ దేశం' — పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు   •   క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు   •   ఫార్మా కంపెనీలో గాయపడిన కార్మికులకు అండగా ఉంటాం   •   అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు   •   తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •   రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్   •  

ఆలయం ముందే డంపింగ్ యార్డ్

02-01-2026 12:47 AM

నరక యాతన అనుభవిస్తున్న భక్తులు. 

నాగర్ కర్నూల్, జనవరి 1 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని చందాయపల్లి శివారు ప్రాంతంలో రైతులు స్వయంగా నిర్మించిన శ్రీ హనుమాన్ దేవాలయం సమీపంలో ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినాన రైతులు భక్తిశ్రద్ధలతో పశుపూజ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎద్దుల బండ్లకు పూజలు చేసి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలు, డంపింగ్ యార్డు వైపు వెళ్లే వాహనాల రాకపోకల కారణంగా చందాయపల్లి ప్రధాన రోడ్డు పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది.

దీంతో పంట పొలాలకు వెళ్లే రైతులు తమ ద్విచక్ర వాహనాలను వదిలి కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆలయ సమీపంలోని డంపింగ్ యార్డ్ మాదిరి పట్టణంలో సేకరించిన చెత్తాచెదారాన్ని పడేయడంతో ఆ ప్రాంతంలో దుర్వాసన వెదజల్లుతోంది.  రాబోయే సంక్రాంతి పండుగ నాటికి ఈ రోడ్డును తక్షణమే పునరుద్ధరించాలని రైతులు అధికారులను కోరుతున్నారు.