తాగునీటి కష్టాలు
చిన్నంబావి ఏప్రిల్ 17: ఒకవైపు వేసవి ఉష్ణోగ్రతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో మండల పరిధి లోని అమ్మాయి పల్లి,వెలగొండ,పెద్ద బిల్కు గ్రామా ల్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. గ్రామాల్లోని బోర్లు,బావులు పూర్తిగా నీరు ఎండిపోవడమేతో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. కొళాయిల ద్వారా అందిస్తున్న నీటి సరఫరా కనీస అవసరాలకే చాలడం లేదని మహిళలు వాపోతున్నారు.
గ్రామాల్లోని తాగునీటి పథకాల ద్వారా సరఫరా చేస్తున్న నీరు చాలా తక్కువగా ఉంటోందని,మరికొన్ని గ్రామాల్లో కనీసం అవసరాలే తీరడం లేదని మహిళలు చెబుతున్నారు. మరికొన్ని గ్రామాల్లో త్రాగునీటి బోర్ల మోటార్లు సరిగా పనిచేయకపోవడంతో గత ఐదు ఆరు రోజులుగా నీటి కష్టాలు తీరడం లేదని, ఆయా గ్రామాల ప్రజలు తాగునీటి కోసం పోలాల బాటా పడుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా పనులకు వెళ్లకుండా ప్రజలు రైతులు పంట పొలాలలో వేసిన బోర్లను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేయాలని ఆయా గ్రామాల మహిళలు కోరుతున్నారు.






