చదువుతోపాటు నైతిక విలువలూ ముఖ్యం
- విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య
- భూదాన్ పోచంపల్లి దేశ్‌ముఖి విజ్ఞాన్స్‌లో ప్రారంభమైన బీటెక్ ఫస్టియర్ తరగతులు
యాదాద్రి భువనగిరి, జూలై 19 (విజయక్రాంతి): విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి నిరంతర అభ్యాసంతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణతో కూడి న జీవితం ఎంతో అవసరమని విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య స్పష్టం చేశారు. విద్యార్థుల్లో చదువు, వ్యక్తిత్వ వికాసం అనేది సంతోషంగా సాగాల్సిన ప్రక్రి య అని ఆయన పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మం డలం దేశ్‌ముఖి గ్రామంలోని విజ్ఞాన్స్ యూ నివర్సిటీలో ఆదివారం బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభమ య్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు.
ఈ సం దర్భంగా డాక్టర్ లావు రత్తయ్య మాట్లాడుతూ.. తమ యూనివర్సిటీలో విద్యార్థుల ను చేర్పించిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు, విద్యార్థులకు అభినందనలు తెలిపారు. విజ్ఞాన్స్ యూనివర్సిటీ ప్రత్యేకంగా నిర్వహిస్తున్న పంచసూత్రాల 1. ఫ్యాకల్టీ డెవలప్మెం ట్ ప్రోగ్రామ్, 2. ప్లానింగ్, ట్రైనింగ్, కమ్యూనికేషన్ సిస్టమ్, 3. కౌన్సిలింగ్ సిస్టమ్, 4. సీఆర్టీ తరగతులు, 5. బోధన పద్ధతి వల్లే తమ దగ్గర చదివిన విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహిస్తున్నారని పే ర్కొన్నారు.
తల్లిదండ్రులందరూ మీ పిల్లలను బాగా ప్రోత్సహించినట్లైతే వారు ఆరోగ్యంగా, మానసికంగా, సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతారని వివరించారు. టీమ్ స్పిరిట్ పెంచేందుకు యూనివర్సిటీలో ఎప్పుడూ ఏదో ఒక ఈవెంట్‌ను నిర్వహిస్తూనే ఉంటామని పేర్కొన్నారు. జీవితంలో నెగ్గడానికి, భవిష్యత్తును నిర్మించుకోవడానికి ప్రిపేర్ అవ్వాలని పిలుపునిచ్చారు. తమ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులలో 85 శా తం మంది పిల్లలకు మల్టీనేషనల్ కంపెనీలలో ఉద్యోగాలు వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. కౌన్సిలింగ్ ద్వారా విద్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసి వారి అభ్యున్నతికి, పరిపూర్ణ వ్యక్తిత్వ నిర్మాణానికి తోడ్పడుతామన్నారు.
ఇంజనీరింగ్ అనేది విద్యార్థుల జీవితాన్ని అద్భుతంగా మార్చే పరివర్తనాత్మక ప్రయాణమని యూనివర్సిటీ ఇన్‌చార్జీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కేవీ కృష్ణకిశోర్ అన్నారు. విజ్ఞాన్స్‌లో చేరడం ద్వారా విద్యార్థులు మంచి అవకాశాన్ని దక్కించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, విజ్ఞాన్స్ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కేవీ కృష్ణ కిశోర్, విజ్ఞాన్స్ యూనివర్సిటీ అడ్వైజర్-రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య, రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంవీ రావు, డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు ఆయా విభాగాల డీన్లు, డైరెక్టర్లు, అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.






