calender_icon.png 17 February, 2026 | 9:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాస్థాయి సీఎం కప్ క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు

17-02-2026 07:59:58 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో రెండు రోజులుగా కొనసాగిన బాల బాలికల జిల్లా స్థాయి సీఎం కప్ కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడా పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీవో దివ్య దర్శనరావు, డివైఎస్ఓ అక్కపాక సురేష్, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ముస్త్యాల రవీందర్, ఎస్‌జీఎఫ్ కార్యదర్శి లక్ష్మణ్ హాజరయ్యారు.

వారు మాట్లాడుతూ, విద్యార్థులు క్రీడలతో పాటు చదువులోనూ ముందంజలో ఉండాలని, క్రీడలు శారీరక, మానసిక అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి మంచి క్రీడాకారులు వెలువడేందుకు ఇలాంటి పోటీలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. పోటీల్లో ప్రతిభ చూపిన విజేతలకు అతిథులు మెడల్స్ అందజేశారు.

ఈ కార్యక్రమంలో  రాష్ట్ర పేట బాధ్యులు శోభారాణి, జిల్లా పేట అధ్యక్ష కార్యదర్శులు వేల్పుల సురేందర్, దాసరి రమేష్, కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు కర్ణాకర్, అసోసియేషన్ కార్యదర్శి వేల్పుల కుమార్, మండల ఎస్జీఎఫ్ కార్యదర్శి తాండ్ర ప్రణయ్, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రసాద్, శ్రీవాణి, సరోజా స్వరూప, సంధ్య, వెంకటేష్ విష్ణు, జావిద్, మాధవి, వెంకటేష్, అజయ్, కుమార్, రాజేందర్, ఇక్బాల్, అజ్జు, గెల్లు మధుకర్, సత్యం, రాజేష్, విద్యార్థులు పాల్గొన్నారు.