ముస్లింలకు రంజాన్ తోఫా కిట్లు పంపిణీ
ఘట్ కేసర్, మార్చి 16 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ సర్కిల్, ఎదులాబాద్ డివిజన్ పరిధిలోని అవుషాపూర్ వార్డు కార్యాలయం వద్ద పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన కాంగ్రెస్ మాజీ కార్యదర్శి కవాడి మాధవ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేడ్చల్ నియోజకవర్గం బీబ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ పాల్గొని ప్రభుత్వం తరపున ముస్లిం సోదరులకు రంజాన్ తోపాను పంపిణీ చేశారు.
ఈసందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ రంజాన్ మాసం శాంతి, సౌభ్రాతృత్వం, సేవా భావానికి ప్రతీక అన్నారు. రాష్ట్రంలోని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. ముస్లిం సోదరులు ఉపవాసాలు విజయవంతంగా పూర్తి చేసుకొని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ ముస్లిం సోదర, సోదరిమణులందరికి తన రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈకార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు మామిళ్ళ ముత్యాల్ యాదవ్, మాజీ సర్పంచ్ బద్దం గోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు గాయరు విశ్వనాధం, కొమురవెళ్లి దేవస్థానం ధర్మకర్త మెరుగు నరేష్ గౌడ్, నాయకులు మెట్టు రమేష్ ,కవాడి వామన్ రెడ్డి, డొంకని శంకర్ గౌడ్, మేడబోయిన జంగయ్య ముదిరాజ్, మేకల సునీల్ కుమార్, మైనారిటీ నాయకులు షాబీర్, బాబా, మాదర్, ఇంతియాజ్, షానూర్ బాబా, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.




