28 August, 2026 | 5:06 PM

వన మహోత్సవంలో మొక్కల పంపిణీ

28-08-2026 03:33 PM

చివ్వెంల, ఆగస్టు 28 (విజయక్రాంతి): వన మహోత్సవంలో(Vana Mahotsav) భాగంగా చివ్వెంల మండలం భధ్యతండ గ్రామపంచాయతీలో శుక్రవారం ప్రతి ఇంటికి రెండు మొక్కల చొప్పున పంపిణీ చేశారు. సర్పంచ్ సైదా నాయక్ ఆధ్వర్యంలో ఇంటింటికీ మొక్కలు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి కుటుంబం మొక్కలను ఇంటి పరిసరాల్లో నాటి, వాటిని సంరక్షించాలని సూచించారు. మొక్కలను పెంచడం ద్వారా గ్రామంలో పచ్చదనం పెంపొందడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.