బషీర్ బాగ్ అమరవీరులకు ఘనంగా నివాళులు
దమ్మపేట,ఆగస్టు 28(విజయక్రాంతి): మండల కేంద్రంలోని సీపీఎం పార్టీ కార్యాలయం సుందరయ్య భవనంలో(Sundarayya Bhavan) బషీర్ బాగ్ డే సందర్భంగా అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. మొదట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2000వ సంవత్సరం ఆగష్టు 28 న విద్యుత్తు చార్జీలు పెంపు పై, ప్రైవేటీకరణకు నిరసనగా ప్రజలు జరిపిన పోరాటంలో పోలీసు కాల్పుల్లో సత్తెనపల్లి రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డిలు ప్రాణాలు కోల్పోయిన వారి చిత్రపటానికి పూలమాల వేసి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం సీపీఎం(CPM party office) పార్టీ మండల కమిటీ సభ్యులు కొప్పుల శ్రీనివాసరావు అధ్యతన జరిగిన సభలో మాజీ జిల్లా కమిటీ సభ్యులు దొడ్డా లక్ష్మి నారాయణ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో 2000 సంవత్సరం లో ఆనాటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా విద్యుత్తు సంస్కరణలలో భాగంగా ప్రపంచ బ్యాంకు షరతులతో విద్యుత్తు చార్జీలు పెంచారు. విద్యుత్తు ను ప్రైవేటీకరణ పేరుతో ఆనాటి ప్రభత్వ విధానాలకు నిరసనగా ప్రజలు వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తున్న సమయంలో హైద్రాబాద్ లోని బషీర్బాగ్ ప్రాంతంలో ప్రజలు పై పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో సత్తెనపల్లి రామకృష్ణ, బాలస్వామి, విష్ణు వర్ధన్ రెడ్డి, అమరులు అయ్యారని వారికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు కొలికి పోగు శ్రీనివాసరావు , కొలికి పోగు కౌశిక్, కొప్పుల శ్రావణి, కొప్పుల వర్షిణి తదితరులు పాల్గొన్నారు.






