5 April, 2026 | 8:54 PM

కాట్నపల్లిలో యువత, స్కూల్ పిల్లలకి క్రికెట్ బ్యాట్స్ పంపిణీ

05-04-2026 03:12 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలో వేసవి కాలంలో యువత, పిల్లలకి ఉపయోగకరంగా ఉండాలని కాట్నపల్లి యువ నాయకులు తాళ్లపల్లి మనోజ్ గౌడ్ యువత, పిల్లలు మొబైల్ ఫోన్ల పైన కాకుండా ఆటలపైన దృష్టి పెట్టాలని ఊరులో ఉన్న అన్ని కాలనీల యూత్ కి క్రికెట్ బ్యాట్స్ ఆదివారం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మనోజ్ గౌడ్  మాట్లాడుతూ నేటి యువత గ్రౌండ్ కి దూరం అవుతున్నారు అని వారికి మొబైల్ ఫోన్ల పైన దృష్టి ఎక్కువ ఉండటం వలన చెడు వ్యసనాలకు గురి అవుతున్నారని అన్నారు,  యువత వ్యసనాలకు దూరం ఉండాలని గ్రామీణ క్రీడలకి దగ్గర అవ్వాలని వారి కోసం ఎలాంటి సహాయసహకారాలు అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాట్నపల్లి యువత, స్కూల్ పిల్లలు పాల్గొన్నారు.