టాటా మ్యాజిక్‌ని ఢీకొట్టిన డీసీఎం
11-05-2026 04:43 PM
ఒకరికి గాయాలు
మంగపేట,(విజయక్రాంతి): ములుగు జిల్లా మంగపేట మండలం బోరు నర్సాపురం గ్రామంలో సోమవారం టాటా మ్యాజిక్ ని డీసీఎం ఢీ కొట్టడంతో పాయం స్రవంతి అనే మహిళకు గాయాలు అయ్యాయి. ఇందుకు సంబంధించి స్థానికుల తెలిపిన ప్రకారం వివరాలు. మండలంలోని బోరు నర్సాపురం గ్రామంలో ఆంజనేయుల స్వామి ఆలయం సమీపంలో మణుగూరు వెళ్తున్న టాటా మ్యాజిక్ ని ఏటూరునాగారం వైపు వెళ్తున్న డీసీఎం ఎదురుగా ఢీ కొట్టింది. ఈ సంఘటనలో టాటా మ్యాజిక్ లో ప్రయాణిస్తున్న వాజేడు మండలం ప్రగళ్ళపల్లి గ్రామానికి చెందిన పాయం స్రవంతి తలకు గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న మంగపేట 108 అంబులెన్స్ ఈఎంటి ఎడ్ల నరేష్, పైలట్ రాజేశ్వర్ గాయపడిన పాయం స్రవంతిని ఏటూరునాగారం సామాజిక వైద్యశాలకు తరలించారు.






