జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా దామెర రమేష్ నియామకం
సత్తుపల్లి,ఆగస్టు 30,(విజయక్రాంతి): సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా దామెర రమేష్ నియమించినట్లు జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ ఆదేశాలు జారీ చేసినట్లు సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్ట రాగమై దయానంద్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కోసం అనేక పోరాటాలు చేశారు. ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ చనిపోయిన సమయంలో అల్లర్లు జరగకుండా మిగతా కార్యకర్తలను సమన్యమయం పరిచి మంచి సేవలందించారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. 1985 నుంచి ఇప్పటివరకు వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కొనసాగుతున్న నాకు ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా నియమించినందుకు ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి దయానంద్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ దయానంద్కి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూత సత్యనారాయణ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నా . 1985 భారత జాతీయ విద్యార్థి సంఘం ఎన్ ఎస్ యు సత్తుపల్లి ప్రధానంగా ఆరోజు స్థాపన చేయటం జరిగింది మరియు 92లో రాజు విగ్రహాన్ని ఖమ్మం జిల్లాలో రెండవ విగ్రహాన్ని ఆరోజు సత్తుపల్లిలో ఏర్పాటు చేయడం జరిగింది అనేకమంది నాయకులకు కాంగ్రెస్ కార్యకర్తగా నా సేవలు అందించినాను.






